హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి వీలైనంత అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు సినిమాలను పక్కన పెట్టేసి రాజకీయాలను టార్గెట్ చేశాడు.

తరచూ ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఏదోక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తన వెంటే ఉండి సపోర్ట్ చేస్తానని చెప్పిన మనోజ్.. జనసేన పార్టీకి సంబంధించి మరో ఆసక్తికర కామెంట్ చేశాడు.

ఈ ఎన్నికల్లో మీరు జనసేనకి సపోర్ట్ ఇస్తారా..? లేక టీడీపీకా..? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకి బదులుగా.. 'జనసేన బ్రదర్.. దాంట్లో మళ్లీ డౌటా..?' అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

సోషల్ మీడియాలో తన సమాధానాలతో ఇతర హీరోల అభిమానులకు కూడా దగ్గరవుతున్నాడు మనోజ్. ఈ ఏడాది జూన్ లో తన కొత్త సినిమా మొదలవుతుందని చెప్పాడు.