మంచు లక్ష్మీకి బంపర్ ఆఫర్.. వామ్మో 'దేవర'లో ఎన్టీఆర్ పక్కన ఏకంగా ఆ పాత్రలో ?
ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది.
మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్.
అయితే ఇటీవల మంచు లక్ష్మికి టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. దీనితో ఆ మధ్యన మంచు లక్ష్మి కాస్త అసహనం కూడా వ్యక్తం చేసింది. తాను హాలీవుడ్ లో ఉండిఉంటే మరిన్ని ఆఫర్స్ వచ్చేవి అని పేర్కొంది. అయితే టాలీవుడ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు మంచు లక్ష్మి తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే.. మంచు లక్ష్మి.. ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం దేవరలో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సాదాసీదా పాత్ర కాదు.. ఏకంగా ఎన్టీఆర్ కి అక్క పాత్రలో మంచు లక్ష్మిని కొరటాల శివ ఎంపిక చేసినట్లు రూమర్.
ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర కాబట్టి మంచు లక్ష్మి అయితే కరెక్ట్ అని కొరటాల భావిస్తున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ రూమర్ లో ఎంత వాస్తవం ఉందనేది చిత్ర యూనిట్ కానీ, మంచు లక్ష్మి కానీ స్పందించాలి. ఒకవేళ ఇది నిజమైతే మంచు లక్ష్మి విశ్వరూపం ప్రదర్శించడం ఖాయం అని అంటున్నారు.