2020 నుంచి రెండేళ్ల దాగుడు మూతల తర్వాత దాని బారిన పడ్డానని ఆమె అన్నారు. కొవిడ్‌ నుంచి త్వరగా బయట పడేందుకు తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, తనలోని కొన్ని నైపుణ్యాల్ని కూడా ఈ సందర్భంగా ఉపయోగిస్తానని ఆమె తెలిపారు.


ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా కరోనా బారిన పడిన సంగతి తెలసిందే. ఇప్పుడు కోవిడ్ నుంచి బయిటపడ్డారు. కానీ కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులు నుంచి మాత్రం కోలుకోలేదు. ఆ విషయమై ఆమె ట్వీట్ చేసారు. ట్విట్టర్‌లో మంచు లక్ష్మీ ... కరోనా తరువాత వచ్చే సమస్యలు దారుణంగా ఉన్నాయంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేసింది. మంచు లక్ష్మీ వేసిన ట్వీట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

2020 నుంచి రెండేళ్ల దాగుడు మూతల తర్వాత దాని బారిన పడ్డానని ఆమె అన్నారు. కొవిడ్‌ నుంచి త్వరగా బయట పడేందుకు తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, తనలోని కొన్ని నైపుణ్యాల్ని కూడా ఈ సందర్భంగా ఉపయోగిస్తానని ఆమె తెలిపారు. ‘‘కరోనా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. సాధారణ జలుబులా మనందరికీ వస్తుంది. చేయాల్సిందల్లా రోగ నిరోధక శక్తిని జాగ్రత్తగా చూసుకోవడం, వైరస్‌తో పోరాడటానికి మన శరీరాలు బలంగా ఉన్నాయని నిర్ధారించుకోవడమే. మనస్సు, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మరిచిపోవద్ద’’ని ట్వీట్‌ చేశారు మంచు లక్ష్మి.

Scroll to load tweet…


కెరీర్ విషయానికి వస్తే...

ఈ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని లక్ష్మీ మంచు.. అధికారికంగా తానే ప్రకటించారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం లక్ష్మి ఇందులో మోహన్‌ లాల్‌కు భార్యగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే పాత్ర ఏంటన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మాన్‌స్టార్‌ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను పోస్ట్‌ చేసిన లక్ష్మి.. ‘ఎట్టకేలకు క్యాట్‌ బయటకు వచ్చేసింది. కొత్త భాష, కొత్త జానర్‌.. సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో మలయాళంలో నటిస్తోన్న నా తొలి చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఈ సినిమాలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న సమయం ఎప్పటికీ మరిచిపోలేనిది’ అంటూ రాసుకొచ్చారు. ఇక లక్ష్మి చివరిగా తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘పిట్ట కథలు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే.