బోల్డ్ కి, వల్గర్ కి తేడా ఉంటుంది.. 'RX100' పై మంచు లక్ష్మీ అసహనం

First Published 25, Jul 2018, 3:29 PM IST
manchu lakshmi comments on RX100 movie
Highlights

బోల్డ్ సినిమాలకు, వల్గర్ సినిమాలకు చాలా తేడా ఉంటుందని. మహిళలను తక్కువ చేసి చూపించడాన్ని ఖండిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. 'RX100' సినిమాలో హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించిన సంగతి తెలిసిందే.

నూతన దర్శకుడు అజయ్ భూపతి అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కించిన 'RX100' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాగుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం వల్గర్ కంటెంట్ అనే కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. సినిమా వసూళ్ల విషయంలో మాత్రం సత్తా చాటుతోంది. వారం రోజుల్లో రూ.10 కోట్ల షేర్ సాధించి మిగిలిన సినిమాలకు పోటీనిస్తోంది.

ఈ సినిమా జోరు ముందు వెలవెలబోయిన చిత్రాల్లో మంచు లక్ష్మీ 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మంచు లక్ష్మి 'RX100' సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా పేరు ఎక్కడా వాడకుండా పరోక్షంగా విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ సినిమాలకు, వల్గర్ సినిమాలకు చాలా తేడా ఉంటుందని. మహిళలను తక్కువ చేసి చూపించడాన్ని ఖండిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. 'RX100' సినిమాలో హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించిన సంగతి తెలిసిందే.

దానిని ఉద్దేశించే ఆమె ఇలా కామెంట్ చేసిందని తెలుస్తోంది. వల్గారిటీ లేకుండా విడుదలైన మహానటి, క్షణం, పెళ్లిచూపులు వంటి సినిమా ఎక్కువగా ఇష్టపడతానని చెప్పిన ఆమెకు 'అర్జున్ రెడ్డి' సంగతి ఏంటి అనే ప్రశ్న ఎదురైనది. దీనికి సమాధానంగా అది వల్గర్ మూవీ కాదని నిజమైన వ్యక్తి ఎమోషన్స్ ను తెరపై చక్కగా చూపించారని రీసెంట్ గా విడుదలైన సినిమాలో మాత్రం మహిళను తప్పుగా చూపించారని స్పష్టం చేశారు.  

loader