ఇండియా, పాక్ మధ్య క్రికెట్ జరుగుతుంటే అభిమానుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ఇక సినీ తారలు కూడా క్రికెట్ అభిమానులే. ప్రపంచకప్ లాంటి వేదికపై దాయాది దేశాలు రెండూ క్రికెట్ ఆడుతుంటే అభిమానులు అంతా టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య ఇంగ్లాడ్ లోనే మాంచెస్టర్ లో రసవత్తరమైన పోరు జరుగుతోంది. 

ఈస్టేడియంలో మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి సందడి చేస్తోంది. మ్యాచ్ వీక్షించేందుకు ఆమె ఇంగ్లాడ్ వెళ్లారు. త్రివర్ణ పతాకం చేతిలో పట్టుకుని టీం ఇండియాకు మద్దతు తెలుపుతోంది. మంచు లక్ష్మీ స్టేడియంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు బాలీవుడ్ స్టార్ రన్ వీర్ సింగ్ కూడా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తున్నాడు. రణవీర్ సింగ్ ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ మూవీ 83లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రణవీర్ భార్య దీపికా పదుకొనె కూడా నటిస్తోంది.