Asianet News TeluguAsianet News Telugu

‘కన్నప్ప`తో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఎంట్రీ.. ఒక్క సినిమాలో మూడు తరాల నటులు

మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమాల్లోకి వస్తున్నారు. మంచు విష్ణు కొడుకు బాల నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నారు. ఒకే సినిమాలో మూడు తరాలు కనిపించబోతున్నారు.

manchu family third generation in movie vishnu son avram entry with kannappa arj
Author
First Published Jan 5, 2024, 4:13 PM IST

చిత్ర పరిశ్రమలోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ `శాకుంతలం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నారు. మంచు విష్ణు కొడుకు మంచు అవ్రాహ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాల నటుడిగా మెప్పించబోతున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మక మూవీ `కన్నప్ప` చిత్రంలో విష్ణు తనయడు మాస్టర్‌ అవ్రామ్‌ నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో `కన్నప్ప` చిత్రం రూపొందుతుంది. 

మైథలాజికల్‌ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో మంచు విష్ణుతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, మోహన్‌బాబు కీలక పాత్రలో మెరవబోతున్నారు. తాజాగా మంచు వారి వారసుడు సినిమాలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ గురించి చిత్ర బృందం చెబుతూ, న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు.

మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు రాగా.. విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నారు. విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దృశ్యకావ్యమైన 'కన్నప్ప'తో మొదలుపెట్టారు.  నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది. న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు నిర్విరామంగా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే.  అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. ‘ఈ 'కన్నప్ప' సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. ఇక ఇప్పుడు తన కొడుకు ఎంట్రీపై స్పందించారు. 'అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios