మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర టీజర్ మంగళవారం విడుదలయింది. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి ఘనంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. సైరా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ అధికమించింది. 

సైరా టీజర్ పై అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా సైరా టీజర్ పై మంచు కుటుంబ సభ్యులు మంచు మనోజ్, మంచు లక్ష్మి స్పందించారు. 'మిత్రమా రాంచరణ్ నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 

'టీజర్ లో మెగాస్టార్ ఎనర్జీ చూశాక నా మతి పోయింది. చిరంజీవి అంకుల్ ని మెగాస్టార్ అనేది అందుకే. ఇంతటి క్వాలిటీతో చిత్రాన్ని నిర్మించిన రాంచరణ్ కి అభినందనలు' అని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు.