మంచు మోహన్ బాబు సినీ వారసులుగా వెండితెరకి పరిచయమైన మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా రాణించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. విష్ణు కమర్షియల్ సినిమా చేస్తుంటే, మంచు మనోజ్ సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు నిర్మాతలుగా మారి సినిమాలు కూడా తీశారు.

కానీ ఇప్పుడు హీరోలుగా వీరి పరిస్థితి దారుణంగా మారింది. విష్ణుకి కానీ, మనోజ్ కి కానీ ఒక్క హిట్టు కూడా రావడం లేదు. ఈ ఇద్దరూ హిట్ రుచి చూసి చాలా రోజులవుతుంది. తమ సొంత బ్యానర్ పై సినిమా తీసే పరిస్థితి లేదు. బయట నిర్మాతలు వీళ్లతో సినిమాలు తీయడానికి ఆలోచిస్తున్నారు. 

విష్ణు నటించిన 'ఓటర్' సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియడం  లేదు. ఈ క్రమంలో విష్ణు సినిమాలను పక్కన పెట్టి తన వ్యాపారాల్లో బిజీ అయిపోయినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. హైదరాబాద్ లో మంచు విష్ణుకి కేర్ స్కూల్ ఉంది. దాని వ్యవహారాలతో పాటు తిరుపతిలోని విద్యానికేతన్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు.

మరోపక్క మనోజ్ వచ్చే ఏడాదిలో సినిమా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎంతవరకు అనేది తెలియడం లేదు. ఇప్పుడు సమాజ సేవ అంటూ కొన్ని కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డాడు. ఇప్పట్లో మంచు బ్రదర్స్ సినిమాలలో కనించే ఛాన్స్ లేదని అంటున్నారు.