అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 52 ఏళ్ల వయసు గల నారాయణరెడ్డి చాలా కాలంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. ఆయనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

నారాయణరెడ్డి మరణించిన తరువాత తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చడీచప్పుడు లేకుండా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారని, ఆయన శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.