Asianet News TeluguAsianet News Telugu

అక్షయ్ కుమార్ పేరు చెప్పి అమ్మాయిని ట్రాప్, అరెస్ట్

ఆ పేరుతో ఎవరూ పనిచేయటం లేదని, ఇదంతా ఫ్రాడ్ అని అర్దం చేసుకుని పోలీస్ లను ఎప్రోచ్ అయ్యింది. 

Man Attempts 6 Lakh Fraud Offering Job In Actor Akshay Kumar Production House jsp
Author
First Published Apr 11, 2024, 3:41 PM IST


సినిమా వాళ్ల పేరు చెప్పి మోసాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు అక్షయ్ కుమార్ పేరు చెప్పి ఆరు లక్షల రూపాయల ఫ్రాడ్ ఒకరు చేయబోయి చివరి నిముషంలో దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై జూహూ పోలీస్ స్టేషన్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ... ఏప్రియల్ 3 న ప్రిన్స్ కుమార్ రంజన్ అంజనీకుమార్ సిన్హా అనే అతను ఈ మోసానికి పాల్పడ్డాడు. అతను పూజ ఆనందనీ అనే నటి నెంబర్ తీసుకుని పోన్ చేసారు. తన పేరు హోషన్ మెహ్రా అని, అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తాను ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఆమెకు వేషం ఇప్పిస్తానని నమ్మబలికారు. అలాగే తాను సోషల్ మీడియా ఇన్ఫూలియన్సర్ అని చెప్పారు.

ఆమెతో ఫోన్ లో మంచి ఫ్రొఫైల్ ఫొటో కావాలని చెప్పారు. అమితాబ్ ఫొటో గ్రాఫర్ చేత ఫొటో తీయించుకోమని సలహా ఇచ్చారు. అతనితో ఫొటో తీయించుకోవటం కోసం ఆరు లక్షలు ఖర్చు అవుతుందని , ఫ్రొఫైల్ ఫొటో తీయించుకున్న వెంటనే ఆమెకు వేషం దొరుకుతుందని చెప్పారు. ఆ సినిమా మహిళా ప్రధానమైనదని లీడ్ రోల్ ఇస్తారని నమ్మబలికారు. అయితే ఆనందిని కు అనుమానం రావటంతో ..అక్షయ్ ఆఫీస్ కు వెళ్లి కలిసింది. అక్కడ ఆ పేరుతో ఎవరూ పనిచేయటం లేదని, ఇదంతా ఫ్రాడ్ అని అర్దం చేసుకుని పోలీస్ లను ఎప్రోచ్ అయ్యింది. దాంతో పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios