మమతా మోహన్‌దాస్‌ (mamta mohandas) అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఖరీదైన కారు(costly car)ని కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.  కాస్ట్లీ స్పోర్ట్స్  కారుని తన షెడ్‌కి చేర్చింది మమతా. ఈ కార్‌ కొనడం డ్రీమ్‌ నెరవేరినట్టుందని పేర్కొంది. 

ఎన్టీఆర్‌(ntr)తో నటించిన `యమదొంగ`(yamadhonga) చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్‌దాస్‌(mamta mohandas). తెలుగులో ఆమె చాలా చిత్రాలే చేసినా.. ఈ సినిమా మాత్రం ఆమెకి స్పెషల్‌ అనే చెప్పాలి. చాలా రోజులుగా తెలుగుకి దూరంగా ఉంటున్న మమతా మోహన్‌దాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఖరీదైన కారుని కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. `ఫోర్చె911 కారెర్రా` మోడల్‌ కి చెందిన స్పోర్ట్స్ కారుని తన షెడ్‌కి చేర్చింది మమతా. ఈ కార్‌ కొనడం డ్రీమ్‌ నెరవేరినట్టుందని పేర్కొంది. 

తన తల్లిదండ్రులతో కలిసి మమతా మోహన్‌ దాస్‌ ఈ కారును కొనుగోలు చేసింది. ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 3.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 450 బిహెచ్‌పి పవర్ కలిగి ఉంది. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ కారు ధర రూ. 1.80 కోట్లు కావడం విశేషం. ప్రస్తుతం మమతా మోహన్‌ దాస్‌ తన కొత్త కారు ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందాన్నివ్యక్తం చేసింది. దీంతో ఈ కొత్త కారు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇందులో మమతా పేర్కొంటూ, 'నా కల నిజమైంది. దీని కోసం దశాబ్ధం పాటు ఎదురుచూశాను. ఫైనల్లీ ఇప్పుడు దీన్ని సొంతం చేసుకున్నాను. నా కుటుంబంలో న్యూ మెంబర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మలయాళంకి చెందిన మమతా మోహన్‌దాస్‌ `యమదొంగ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన ఈ భామ `కృష్ణార్జున`, `హోమం` సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును కొని ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది.

View post on Instagram