బాలీవుడ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా శరావత్. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, అందాల ఆరబోతతో మల్లికా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించేది. చాలా చిత్రాలు మల్లికా గ్లామర్ షోతోనే కాసుల పంట పండించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మల్లికా శరావత్ బాలీవుడ్ లో సినిమాల జోరు బాగా తగ్గించింది. ప్రస్తుతం మల్లికా నటిస్తున్న చిత్రం 'బూ..సబ్కి ఫేటేగి' అనే చిత్రంలో నటిస్తోంది. 

ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇటీవల మల్లికా శరావత్ కపిల్ శర్మ షోలో పాల్గొంది. ఈ షోలో మల్లికా శరావత్ అందాల ఘాటుని వర్ణిస్తూ కపిల్ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు. గతంలో చపాతీలు వేడిగా ఉండడం కోసం ఓ హీరోయిన్ పోస్టర్స్ తో చుట్టేవారట నిజమేనా అని ప్రశ్నించగా.. నాకు తెలియదు అంటూ మల్లికా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 

మీరు చెప్పింది చాలా సరదా విషయం. కానీ కొంతమంది నా అందాన్ని వికృతంగా ఉపయోగించుకోవాలనుకున్నారు అంటూ బాలీవుడ్ తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని మల్లికా వివరించింది. ఓ సన్నివేశంలో భాగంగా నా నడుము, బొడ్డుని హైలైట్ చేయాలని దర్శకుడు, నిర్మాత భావించారు. ఆ విషయం నాతో చెప్పగా ఓకే అన్నాను. కానీ సెట్స్ కు వెళ్లిన తర్వాత నా నడుముపై కోడిగుడ్డు పెట్టి వికృతంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అలాంటి సన్నివేశాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాను. 

నాపై జరిగిన నెగిటివ్ ప్రచారం కారణంగా దాదాపు 30 చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు మల్లికా వివరించింది. మల్లికా కోపిష్టి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అంటూ కొంతమంది వ్యతిరేక ప్రచారం చేశారు. చాలా మంది హీరోలు నన్ను తప్పించి ఆ స్థానంలో తమ ప్రియురాళ్లని తీసుకునేవారని మల్లికా శరావత్ ఆరోపించింది.