‘మళ్లీ రావా’ కలెక్షన్లు చాలా పూర్ గురూ!

‘మళ్లీ రావా’ కలెక్షన్లు చాలా పూర్ గురూ!

మళ్లీరావా ... చిత్రం ఒవర్ సీస్ బాక్సాఫీస్ వద్ద కుదేలయింది. ఆశించినంత కలెక్షన్లు లేవు. 

వోవర్ సీస్ రైట్స్ కొన్న బ్లూ స్కై సినిమా ఈ విషయంలో బాగా నిరాశ చెందిందని తెలిసింది.

నిజానికి మళ్లీ రావా... అంత తీసేయదగ్గ చిత్రమేమీ కాదు. సినిమా గురించి చక్కని రివ్యూలొచ్చాయి. ఈ రివ్యూలు చేసి సినిమా హిట్టవుతుందనుకున్నారు.అయితే, తీరా చూస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా తక్కుగా ఉన్నాయి. సుమంత్, ఆకాంక్ష సింగ్ ఇందులో లీడ్ రోల్స్ లో ఉన్నారు.

గౌతమ్ తిన్ననూరి తీసిని  రొమాంటిక్ వినోదభరితమయిన చిత్రమిది. స్పెషల్ ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయినా సరే, కెలక్షన్లు పూర్ గా ఉన్నాయి.

గురువారం నాడు 17 వేల డాలర్లు తో వోవర్ సీస్ ప్రీమియర్లు మొదలయ్యాయి.శుక్రవారం నాడు  30 వేల డాలర్లకు, శనివారం నాడు 35 వేల డాలర్లకు కలెక్షన్లు చేరుకున్నాయి. అదివారం నాటికి మొత్తం కలెక్షన్లు  లక్షడాలర్లు మించలేదు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos