Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 21వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో మల్లి గతంలో మాలిని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. నాకంటే ముందు అదే మనసులో మాలిని అక్క ఉంది అనడంతో అప్పుడు అరవింద్ నువ్వు దూరంగా వెళ్తాను అంటే నేను ఒప్పుకోను మల్లి ఇంకొకసారి అలాంటి ఆలోచన నీ మనసులో రానివ్వకు అని అంటాడు. నేను వెళ్లకూడదు అంటే నువ్వు మీరు వెళ్లి మాలిన అక్కతో ప్రేమగా మాట్లాడాలి. ఇంతకుముందు మాలిని అక్కతో ఉన్నట్టుగా ఉండడానికి ప్రయత్నించండి అని అంటుంది. ఇంతకుముందు లాగే మాట్లాడి అక్కకు మీరు ఉన్నారు అన్న ధైర్యాన్ని ఇవ్వండి అని అంటుంది. అప్పుడు అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు మాలిని జరిగిన విషయాలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి అరవింద్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అనడంతో నాతో మాట్లాడే సమయం కూడా నీకు ఉందా అని అంటుంది. ఏం మాట్లాడుతావు మళ్ళీ జరిగింది తప్పు సారీ అని చెప్తావు అంతే కదా అనడంతో నేనేం తప్పు చేయలేదు. అక్కడ అసలు అంత పెద్ద విషయం కూడా కాదు అని అంటాడు అరవింద్. నాకు ఒకటి అర్థం అయింది నువ్వు నాతో గొడవపడడానికి ఇక్కడికి వచ్చావు అంటుంది మాలిని. నువ్వు ఒకటి ఆలోచించు మాలిని మనిద్దరి వల్ల ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు అనడంతో నువ్వు నా గురించి ఆలోచించు అరవింద్ నీ వల్ల మల్లి వల్ల నేను బాధపడుతున్నాను అని అంటుంది మాలిని.
అప్పుడు అరవింద్ నచ్చచెప్పడానికి ప్రయత్నించగా మాలిని మాత్రం వినిపించుకోకుండా తన మాట కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి మాలిని నేను ఒక్కసారి కాదు పది సార్లు స్వారీ చెప్తాను అనగా అదేంటి అలా మాట్లాడుతున్నావ్ అరవింద్ నేను నీ స్వారీ కోసం ఇదంతా చేస్తున్నానా అని అంటుంది మాలిని. నా ఉద్దేశం అది కాదు మాలిని నేను ఏం చేస్తే నువ్వు ఇంతకుముందులాగా ఉంటావు అనడంతో నేను చెప్పిన నువ్వు చేయలేవు అరవింద్ అందుకే నేను ఒక విషయం తీసుకున్నాను అని అంటుంది. ఏంటది అనగా లెట్స్ బ్రేకప్ అనగా అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
మన రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను అనడంతో అరవింద్ ఆశ్చర్యపోతాడు. మనిద్దరు కొద్దిరోజులు దూరం ఉందాం అరవింద్ అప్పుడైనా మన మధ్య ప్రేమ కలుగుతుందేమో చూద్దాం అంటే నాకు తప్పకుండా డెసిషన్ తీసుకున్నావా మాలిని అనడంతో అవును అంటుంది. నీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదా అనడంతో సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. అప్పుడు మాలిని లగేజ్ తీసుకొని కిందికి వెళ్లడంతో ఎక్కడికి వెళ్తున్నావ్ మాలిని అని అనుపమ అడగగా మా ఇంటికి అత్తయ్య అని అంటుంది.
ఏమైంది మాలిని ఎందుకు సడన్గా అనడంతో ఇక్కడ నాకు మనశ్శాంతి లేదు నా మనసు కుదుటపడే వరకు అక్కడే ఉండాలని అనుకుంటున్నాను అంటుంది మాలిని. అప్పుడు మాలిని మాటలకు అనుపమ వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు అనుపమ ఇంట్లో అందర్నీ పిలిచి ఏంటి అరవింద్ ఇది మాలిని పుట్టింటికి వెళ్తుంది అంట నీకు తెలుసా అనడంతో తెలుసమ్మా అని అంటాడు. భార్యాభర్తల మధ్య సవాలక్ష గొడవలు వస్తాయి కూర్చుని పరిష్కరించుకోవాలి కానీ ఇలా చేయకూడదు అని అంటుంది అరవింద్ వాళ్ళ పెద్దమ్మ.
చూడమ్మా మాలిని మన ఆడవారికి భూదేవి అంత సహనం ఉంటుంది అనడంతో నేను చాలా రోజుల నుంచి ఓర్పుగా ఉంటున్నాను అత్తయ్య నా మనసుకి గాయం తగులుతుంది అని అంటుంది. అరవింద్ కోపాన్ని నేను భరించగలను కానీ అరవింద్ పూర్తిగా మారిపోయాడు నామీద ప్రేమ తగ్గిపోయింది అనడంతో మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గుడి ముందు బిచ్చగాడిలా అరవింద్ ఎప్పుడెప్పుడు నామీద ప్రేమ చూపిస్తాడా అని నేను ఎదురు చూడలేను. అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంది మాలిని. బాయ్ మామయ్య బాయ్ అత్తయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మల్లి వెళ్లి మాలిని కాళ్ళ మీద పడుతుంది.
నన్ను క్షమించు మాలిని అక్క నా వల్లే మీరిద్దరూ ఇలా దూరంగా ఉంటున్నారు అని అంటుంది. నేను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను నన్ను క్షమించు అక్క వెళ్లొద్దు అక్క అని అంటుంది. నువ్వేం తప్పు చేయలేదు మల్లి. తప్పంతా అరవిద్ దే అని అంటుంది. అప్పుడు అరవింద్ నేను కావాలని ఏ తప్పు చేయను ఆ విషయం నీకు కూడా తెలుసు, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనడంతో ఆ కారణం ఏంటని అడుగుతున్నాను అంటుంది మాలిని. నేను ఎన్ని చెప్పినా నువ్వు వెళ్లాలని నిర్ణయించుకున్నావు మల్లి విషయంలోనే వెళ్తున్నావని నాకు అర్థం అయింది మాలిని అంటాడు అరవింద్.
నీకు తెలియని విషయమేమంటే మనం ఇద్దరం కలిసే ఉండాలని మాట్లాడుకోవాలని మల్లి నన్ను కన్విన్స్ చేసిన దగ్గర పంపించింది అనడంతో మల్లి చెప్తే గాని నీకు నాతో మాట్లాడాలి అనిపించలేదా అంటుంది మాలిని. చూశారు కదా విన్నారు కదా అత్తయ్య ఈ ప్రేమ తట్టుకోలేక నేను వెళ్ళిపోతున్నాను అని మాలిని అక్కడి నుంచి ఎవరి పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు అరవింద్ జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు మాలిని పుట్టింటికి వెళ్లడంతో అప్పుడు ఇంట్లో అందరూ సంతోష పడుతూ ఉండగా ఇంతలో వసుంధర అక్కడికి వచ్చి ఏంటి మాలిని ఇంత తొందరగా వచ్చేసావా ఆ ఇంట్లో నుంచి నువ్వు ఇంకా లేటుగా వస్తావని అనుకున్నాను అనడంతో వెంటనే శరత్ నీ నోటికి మంచి మాటలు రావా వసుంధర అని అంటున్నాడు.
అప్పుడు మీరు మాలినీ సంతోషంగా ఉండడం చూస్తున్నారు నేను తన కళ్ళలోని కన్నీళ్లను చూసి అలా మాట్లాడుతున్నాను అంటుంది వసుంధర. అదేంటి వసుంధర అనడంతో మాలిని తన అత్తారింట్లో అసలు సంతోషంగా మనశ్శాంతిగా లేదు అని అంటుంది. అప్పుడు శరత్ చూడమ్మా మళ్ళీ మీ అమ్మ చెప్తున్నది అబద్ధాలు అని చెప్పు అనడంతో లేదు డాడీ మామ్ చెబుతున్నది నిజమే అని అంటుంది. నేను మనశ్శాంతిగా లేను అని అనడంతో శరత్ షాక్ అవుతాడు. అందుకే డాడ్ ఇక్కడ పది రోజులు ఉందామని వచ్చాను అనడంతో పది రోజులు కాకపోతే పది నెలలు ఉండు మాలిని అనడంతో ఏంటి వసుంధర అలానే కూతురికి చెప్పాల్సింది అనడంతో ఇంకెలా మాట్లాడాలి అని అంటుంది వసుంధర.
అప్పుడు శరత్ వాళ్ళ అమ్మ అర్థం అయ్యే విధంగా చెప్తుండగా అవసరం లేదు అని అంటుంది. నా కూతురు అక్కడ నరకం అనుభవిస్తూ బతకాల్సిన అవసరం లేదు నాలాగే నా కూతురు బతుకు కాకూడదు వద్దు అని అంటుంది వసుంధర. అప్పుడు మల్లి గురించి వసుంధర నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
