తీవ్ర విషాదం.. ప్రముఖ నటి మృతి, ఆ సమస్యతో బాధపడుతూ 41 ఏళ్ల వయసులోనే..
చిత్ర పరిశ్రమలో విషాదాలు విరామం లేకుండా జరుగుతూనే ఉన్నాం. తాజాగా మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళీ నటి సుబి సురేష్ (41) అతి పిన్న వయసులోనే కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో విషాదాలు విరామం లేకుండా జరుగుతూనే ఉన్నాం. తాజాగా మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళీ నటి సుబి సురేష్ (41) అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. గత కొంతకాలంగా సుబి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కొచ్చిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆమె మరణించారు. దీనితో మలయాళీ చిత్ర పరిశ్రమలో, ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. సుబి సురేష్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమం కావడంతో ఆమె మరణించారు.
దీనితో ఆమె నటించిన చిత్రాలు, బుల్లితెర కార్యక్రమాలు, స్టేజి పెర్ఫామెన్స్ లని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సుబి సురేష్ మల్టి ట్యాలెంటెడ్ నటి. ఆమె మిమిక్రి ఆర్టిస్ట్ కూడా. అనేక వేదికలపై స్టేజి పెర్ఫామెన్స్ లు ఇచ్చారు. టివి కార్యక్రమాల్లో హోస్ట్ గా చేశారు. సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. కనిక సింహాసనం లాంటి చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ చేశారు సుబి సురేష్ దాదాపు 20 చిత్రాల్లో నటించారు.
సుబి సురేష్ కి తల్లి దండ్రులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆమె మృతితో మలయాళీ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరై విజయన్ సైతం సుబి సురేష్ మృతికి సంతాపం తెలిపారు. ఆమె టివి షోలు, కామెడీ కార్యక్రమాల ద్వారా మలయాళీల హృదయాలు గెలుచుకున్నారు అని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.