Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీని కలిసిన ఉన్ని ముకుందన్, మలయాళ యంగ్ స్టార్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.

ప్రముఖ  మలయాళ  నటుడు..యంగ్ స్టార్  ఉన్ని ముకుందన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  కలిశారు. పీఎంతో ప్రత్యేకంగా భేటీ అయిన ముకుందన్.. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 
 

Malayalam Young Star Unni Mukundan Meets PM Narendra Modi JMS
Author
First Published Apr 25, 2023, 8:26 AM IST


మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసి.. సౌత్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్.  తాజాగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు ఉన్ని ముకుందన్. ఆయన ఏమన్నారంటే... థ్యాంక్యూ సార్.. 14 ఏళ్ళ తరువాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. చిన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. నేను కోలుకోలేదు.. మళ్ళీ ఎప్పుడు మిమ్మల్నికలుస్తానా ..గుజరాతీలో మీతో ఎప్పుడు మాట్లాడుతానా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకల నిజమైయ్యింది. నా సోషల్ మీడియాలో  ఇది చాలా ఉత్తేజకరమైన పోస్ట్.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఉన్ని ముకుందన్. 

 మీ సమయం 45 నిమిషాలు నాకు ఇచ్చినందకు ధన్యవాదాలు..  నా జీవితంలో ఈ 45 నిమిషాలు చాలా మెమరబుల్ .. మీరు నాకు చెప్పిన మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను... ప్రతి సలహా ఆచరణలో పెడతాను. మీ సలహాలను ఖచ్చితంగా అమలు చేస్తాను అంటూ ట్వీట్ చేశారు ఉన్నిముకుందన్.  అంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్ని ముకుందన్ తో 45 నిమిషాలు టైమ్ కేటాయించడం.. హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య సౌత్ లో ఫిల్మ్ స్టార్స్ పై ఫోకస్ చేసింది బీజేపీ. తెలుగులో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో వరుసగా భేటీ అవుతున్నారు. అటు కన్నడ నాట స్టార్ హీరో  కిచ్చా సుధీప్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక కేరళలో కూడా సినిమా తారలకు బీజేపీ స్పేస్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

 

ఇక ఈ మలయాళ యంగ్ స్టార్ పోస్ట్ కు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. యువర్ లక్కీ అని కొదరు... విశ్వ గురువు ఆశీర్వాదాలు నీకు లభించాయని  మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఉన్ని ముకుందన్ తాజాగా తెలుగులో  సమంత లీడ్ రోల్ చేసిన యశోద సినిమాతో పాటు.. రవితేజ ఖిలాడి   సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ, కన్నడ  సినిమాల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు  ఉన్ని ముకుందన్. ముఖ్యంగా అతను జనతా గ్యారేజ్ సినిమాలో  చేసిన పాత్ర టాలీవుడ్ లో మంచి పేరు తీసుకు వచ్చింది. మలయాళంలో హీరోగా నటిస్తూ.. ఇతర భాషల్లో నెగెటీవ్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నాడు. 

ప్రస్తుతం ఉన్ని ముకుందన్ కు సబంధించి కేరళలో ఓ కేస్ నడుస్తుంది. తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి గతంలో కోర్టుకు ఎక్కింది. ఈ విషయంలో.. తనతో సెటిల్ మెంట్ చేసుకున్నట్టు ఫేక్ డాక్యూమెంట్స్ సృష్టించాడంటూ.. మరోసారి ఆ యువతి కేరళ హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఉన్ని ముకుందన్ కు కోర్ట్ షాక్ ఇస్తూ.. సమాన్లు కూడా జారీ చేసింది. ఇక ఈ కేస్ నడుస్తున్న క్రమంలో.. ఉన్ని ముకుందన్ ప్రధానిని  కలవడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. 

ఇక ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు ఉన్ని ముకుందన్. మలయాళంలో మాలికాపురం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతని సినిమాలు జోరు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. తమిళ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడంలేదు ఉన్ని ముకుందన్ కు. ఈక్రమంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వెల్లడి అవుతున్నాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios