ప్రముఖ మలయాళ యాక్టర్ బాల హాస్పిటల్ లో చేరారు. పలు అనారోగ్య కారణాల వల్ల ఆయన హాస్పిటల్ పాలు అయ్యారు. ఇంతకీ ఆయనకు వచ్చి ప్రాబ్లమ్ ఏంటీ..?
చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది తారు హాస్పిటల్ పాలు అవుతున్నారు. కారణాలుఏమైనా.. ఏజ్ తో సబంధం లేకుండా అనారోగ్యాలు వారిని వెంటాడుతున్నాయి.బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకూ.. వరుసగా తారలు సిక్ అవుతున్నారు. కొంత మంది స్టార్స్ అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఈక్రమంలోనే మరో స్టార్ యాక్టర్ అనారోగ్యంతో హాస్పత్రిపాలు అయ్యాడు.
తాజాగా మరో నటుడు అనాగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ప్రముఖ మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న నటుడు ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్మ తీసుకుంటున్నాడు. బాలాను పరీక్షించిన డాక్టర్స్ .. అతడికి త్వరలో కాలేయ మార్పిడి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక బాలా మలయాళంలో ని పలు చిత్రాల్లో కీ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం మలయాళ, తమిళ పరిశ్రమల్లో కొనసాగుతున్నాడు.
ఇక బాలా తమిళ స్టార్ ప్రొడ్యూసర్ శివ సోదరుడు. ప్రస్తుతం అతను సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. బాలా ఆస్పత్రిలో చేరండంతో మాలీవుడ్ ప్రముఖులు అతన్ని పరామర్శిస్తున్నారు. కొంత మందినేరుగా హాస్పిటల్ కు వస్తుంటే.. మరికొంత మంది ఫోన్ లో పరామర్శిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన వారిలో ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ లు ఉన్నారు. ఇక బాలా బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ లాంటి సినిమాల్లో ప్రముఖంగా నటించారు. ఈసినిమాలతోనే అతను మంచి నటుడిగా మారాడు. ఇక ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బాలా త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీస్ గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. అభిమానులు ప్రార్థిస్తున్నారు.
