ఆస్కార్ బరిలో మలయాళ బ్లాక్ బాస్టర్ ‘2018’.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీ.. డిటేయిల్స్

మలయాళ బ్లాక్ బాస్టర్ 2018 మూవీ భారత్ నుంచి ఆస్కార్ (Oscars2024)కు అధికారిక ఎంట్రీ సాధించింది. అఫిషీయల్ ఎంట్రీకి 22 భారతీయ చిత్రాలు పోటీపడగా జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. 
 

Malayalam film 2018 is inidas Entry for 2024 Oscars NSK

మాలయాళ చిత్రం 2018.. భారత్ నుంచి ఆస్కార్స్2024 బరిలోకి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కేరళ వరదల నేఫథ్యంలో తెరకెక్కిన చిత్రమే 2018. సినిమా ఆద్యంతం భావోద్వేగ సన్నివేశాలతో సాగుతుంది. మలయాళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని భారతీయ ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేశారు. అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ దక్కింది. 

సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ను రాబట్టుకొంది. ఎమోషనల్ అంశాలు కన్నీళ్లు పెట్టాయి. ఆడియెన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కూడామంచి రిజల్ట్ అందింది. ఏకంగా ఈ చిత్రం రూ.100 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. అపర్ణ బాలమురళీ, కుంచావో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

అయితే, చిన్న సినిమా వచ్చి సంచలనంగా మారింది. 2024 ఆస్కార్ బరిలో భారత్ నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అధికారిక ఎంట్రీని దక్కించుకుందని దర్శకుడు గిరీష్ కాసర్లవల్లి  నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. ఈక్రమంలో నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. అమీర్ ఖాన్ ‘లగాన్’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా ఆస్కార్ బరిలో చివరి వరకు నిలవలేదు. అంతకు ముందు ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’ చిత్రాలు మాత్రమే అవార్డు కోసం పోటీ పడ్డాయి. 

చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం ఆస్కార్ కమిటీ దరఖాస్తులు స్వీకరించింది. కాసరవల్లి గిరీష్ అధ్యక్షతన 17 మంది సభ్యులతో కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 22 సినిమాలను కమిటీ చూసింది. ఫైనల్ గా అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 2018 మలయాళం ఫిల్మ్ ను ఎంపిక చేసింది. ఇక గతేడాది ఇండియాకు రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సాంగ్ ‘నాటు నాటు’కు అవార్డు దక్కింది. 

బెస్ట్ ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. అలాగే డాక్యుమెంటరీ సిరీస్ ‘ఎలిఫెంట్ విష్పర్స్’కు అవార్డు దక్కింది. ఇక గతేడాది గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. కానీ తుదివరకు నిలవలేకపోయింది. ఈక్రమంలో మలయాళ చిత్రం 2018 ఎలాంటి పోటినిస్తుందో చూడాలి.

96వ ఆస్కార్ ఈవెంట్ 2024 మార్చి 10న ఆదివారం జరగనుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ లో గ్రాండ్ గా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రాంతాలలో ABC  ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.   


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios