మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన “ఒడియన్” చిత్రం దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ విఎ శ్రీకుమార్ మీనన్‌ ని ఛీటింగ్ కేసులో కేరళ పోలీస్ లు అరెస్ట్ చేసారు. మనీ ట్రాన్సిక్షన్ లో మోసం చేసి శ్రీవాలసం బిజినెస్ గ్రూప్ ని మోసం చేసారని అభియోగం. ఆ గ్రూప్ కు చెందిన రాజేంద్రన్ పిళ్లై ఈ కంప్లైంట్ చేసారు. ఓ సినిమా నిమిత్తం ఏడు కోట్లు తీసుకుని సినిమా చేయలేదు.  తిరిగి వెనక్కి డబ్బు పే చెయ్యలేదు. సినిమాకు సంభందించిన ఏ డవలప్మెంట్ చేయలేదు. దీంతో పోలీస్ లను సంప్రదించిన పిళ్లై కంప్లైంట్ చేయటం జరిగింది. 

శ్రీకుమార్ ని ఈ రోజు కోర్ట్ లో హాజరు చేసారు.406 సెక్షన్ క్రింద మోసం అభియోగం నిరూపించబడింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 420 యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమన్నారు. ఇక శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ కోర్ట్ రిజెక్ట్ చేసింది. శ్రీకుమార్ గతంలో మోహన్ లాల్ తో ఓడియన్ సినిమా చేసారు. 2018లో సినిమా రిలీజైంది. అయితే ఆ సినిమా ఆడలేదు.

ఇక 2019లో నటి మంజు వారియర్ ఈ ఫిల్మ్ మేకర్ పై కేసు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా క్యాంపైన్ ద్వారా తన పరువు ,ప్రతిష్టలు డీఫేమ్ చేయటానికి ప్రయత్నించారని అప్పుడడు అభియోగం. అప్పట్లో మంజు కంప్లైంట్ తో పోలీస్ లు శ్రీ కుమార్ ని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత బెయిల్ పై బయిటకు వచ్చారు. ఓడియన్ సినిమాలో మంజు వారియర్ నటించింది.
 
అలాగే అప్పట్లో  మళయాళంలో  భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని ప్రపంచ తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో మహాభారత ఘట్టాన్ని తెరకెక్కించేందుకు యుఏఇలో ఉంటున్న భారతీయ వ్యాపారి బిఆర్ శెట్టి ముందుకొచ్చారు. భారత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌గా నిర్మించనున్న చిత్రాన్ని తెరకెక్కించే దర్శకత్వ బాధ్యత ఈ ఫిల్మ్‌మేకర్ విఎ శ్రీకుమార్ మీనన్‌కు దక్కింది. రెండు భాగాలుగా నిర్మించనున్న సినిమా షూటింగ్ 2018 సెప్టెంబర్‌లో ప్రారంభం అవ్వాల్సింది.

రెండేళ్ల వ్యవధిలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసి 2020 నాటికి రెండు భాగాలుగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. తొలి భాగాన్ని విడుదల చేసిన 90 రోజుల వ్యవధిలోనే మలి భాగాన్నీ థియేటర్లకు తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే అదీ ముందుకు వెళ్లలేదు.