మలయాళ దర్శకుడు కన్నుమూశారు. ఫుడ్ పాయిజనింగ్‌తో మలయాళ దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యుల ఉనంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ దర్శకుడు కన్నుమూశారు. ఫుడ్ పాయిజనింగ్‌తో మలయాళ దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యుల ఉనంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఆయన ఫుడ్ పాయిజనింగ్‌తో మృతి చెందినట్టు తెలుస్తుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. దర్శకుడు బైజు పరవూర్ జూన్.. ఈ నెల 24న కోజికోడ్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేశారు.
భోజనం చేసిన అనంతరం ఆయన ఇంటికొచ్చారు. బాడీలో ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు బైజు పరవూర్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దర్శకుడు సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ వెనకాల ఏదైనా కారణం ఉందా? ఎవరైనా చేశారా? అనే అనుమానాలు వారి ఫ్యామిలీ నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దాదాపు 45 సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశారు బైజు. ఆయన దర్శకుడిగా మారి `సీక్రెట్` అనే సినిమాని రూపందించారు. ఇది విడుదలకు సిద్దంగా ఉంది. ఇంతలోనే ఆయన కన్నుమూయడం అత్యంత బాధాకరం.
