అల్లరి నరేష్ తో మేడ మీద అబ్బాయి చిత్రంలో నటించిన నిఖిల విమల్ గుర్తుందా. ఆ సినిమా డిజాస్టర్ అయ్యినా ఆమెకు మంచి పేరే వచ్చింది. కానీ చిత్రంగా తెలుగులో ఆమెకు సినిమా ఇచ్చిన నిర్మాత లేరు. అయితే ఇప్పుడు ఆమెకు తమిళంనుంచి ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో కార్తీ కు జోడీగా ఆమె కనిపించనుంది.  ఆమెకిదే తొలి తమిళ చిత్రం కాదు. ఇంతకు ముందు సైతం ఆమె కొన్ని తమిళ సినిమాలు చేసింది. 

ఇక నిఖిల విమల్ ని అఫీషియల్ గా కార్తీ, ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా ఆహ్యానించారు.   ప్రస్తుతం కార్తీ పాపనాశనమ్(దృశ్యం) ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబందించిన షూటింగ్ రీసెంట్ గా  ప్రారంభమైంది. ఈ సినిమాలో కార్తీకి అక్క గా జ్యోతిక నటిస్తుండడం విశేషం. నిజ జీవితంలో వదిన , మరిది అయినా జ్యోతిక , కార్తి ఈ సినిమాలో మాత్రం అక్క, తమ్ముడిగా కనిపించబోతున్నారు. కార్తికి జోడీగా నిఖల విమల్ ని తీసుకున్నారన్నమాట. 

మలయాళ ఫిల్మ్‌ మేకర్‌ జీతూ జోసఫ్‌ ఓ ఎగై్జటింగ్‌ స్క్రిప్ట్‌తో రావడం, జ్యోతిక, కార్తీలకు ఈ కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని తమిళ సినీ వర్గాల టాక్‌. తెలుగు సూపర్‌హిట్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని మలయాళంలో ఒరిజినల్‌ దర్శకుడే  జీతూ జోసఫ్‌ .  ఈ ఫ్యామిలీ డ్రామాలో నిఖిల విమల్  పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆమె పుల్ బిజీ అవటం ఖాయం అంటున్నారు.