Asianet News TeluguAsianet News Telugu

భావనపై దాడి కేసు- అసలు సూత్రధారి కావ్య మాధవన్?

  • మళయాళ నటి భావన కిడ్నాప్ కేసు అనుహ్య మలుపులు తిరుగుతోంది.
  • నిందితుల్లో భావన మాజీ డ్రైవర్ కూడా ఉన్నాడు.
  • నిందుతులను పోలీసులు విచారించగా.. దీనంతటికీ వెనుక  ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఉన్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు
  • స్కెచ్ వేసి  మరీ  కావ్య ప్లాన్ రాసిందట
Malayalam actress assault case Kavya Madhavan is madam says Pulsar Soni

 

మళయాళ నటి భావన కిడ్నాప్ కేసు అనుహ్య మలుపులు తిరుగుతోంది. ఆమెపై కిడ్నాప్ కుట్రకు పాల్పడింది ప్రముఖ నటుడు దిలీప్ అని నిన్నటి దాటా అందరూ భావించారు. కాగా.. ఈ దాడి చేయించింది ఆయన కాదట.. దిలీప్ ప్రస్తుత భార్య కావ్య మాధవన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

 అసలేం జరిగిందంటే.. గత కొంత కాలం క్రితం నటి భావన కారులో వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి యత్నించారు. దాన్నంతటినీ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి అనంతరం ఆమెను  వదిలేశారు. కాగా.. ఆ వీడియోని చూపించి ఆమెను బ్లాక్ మొయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో భావన మాజీ డ్రైవర్ కూడా ఉన్నాడు. నిందుతులను పోలీసులు విచారించగా.. దీనంతటికీ వెనుక  ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఉన్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇదంతా మనందరికీ తెలిసిందే.

నిన్నటి వరకు దిలీప్ పేరు చెప్పిన నిందితులు.. ఇప్పుడు ఇది చేయించింది కావ్య మేడమ్ అని చెబుతున్నారట. దిలీప్ మొదటి భార్య.., నటి భావన.. ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయంలోనే కావ్యకి భావనకి పడలేదని.. అందుకే ఈ దాడి చేయించి ఉటుందని అందరూ భావిస్తున్నారు.  అంతేకాదు.. ఈ దాడి కోసం కావ్య స్కెచ్ వేసి మరీ ప్లాన్ రాసిందట . అయితే.. కావ్య మాత్రం తనకేమీ తెలియదని చెబుతోంది. ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios