మలయాళంలో టీవీ ధారావాహికల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి అపర్ణా పి నాయర్ (33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతికి భర్తే కారణం అని విచారణలో తేలింది.
మలయాళంలో టీవీ ధారావాహికల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న మలయాళ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నిన్న సాయంత్రం 7.30 గంటల సమయంలో సీలింగుకి వేలాడుతున్న అపర్ణను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.కుటుంబ సమస్యలే ఆమె మృతికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్తపై అనుమానం వ్యాక్తం అవుతోంది. ఆ కోణంలో కూడా పోలీసుల దర్యప్తుకొనసాగుతోది. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. చాలాయాక్టీగా ఉండే అపర్ణ.. ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పలు అనుమానాలను కూడా కలిగిస్తోంది.
కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అపర్ణ ఆత్మహత్యకు 11 గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. పలు సూపర్ హిట్ సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న అపర్ణ నాలుగైదు సినిమాల్లోనూ నటించారు. ఆమె ఆత్మహత్య విషయం తెలిసి మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతికి సంతాపంప్రకటిస్తన్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.
అయితే అపర్ణ ఆత్మహత్యకు భర్తే కారణం అని తెలుస్తోంది. అతిగా తాగి రావడం.. భార్యను హింసించడం, భార్యను, పాపను పట్టించుకోకపోవడం..తో పాటు.. అత్తింటివారు కూడా అపర్ణను సరిగ్గా చూసుకోకపోవడం కారణమని పోలీసులు తేల్చారు. ఈక్రమంలో అపర్ణ తన తల్లికి వీడియో కాల్ చేసి.. తన సమస్యలు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు తన సోదరికి కూడా ఫోన్ చేసి పరిస్థితిని వివరించినట్టు సమాచారం. దాంతో ఆమె భర్త పై.. అపర్ణ కుటుంబ సభ్యులు కేసు పెట్టినట్టు తెలుస్తోంది
మలయాళంలో టెలివిజన్ నుంచి ఫేమస్ అయ్యారు అపర్ణ. ఆతరువాత వెండితెరపై కూడా సందడి చేశారు. చందనమాల, ఆత్మసఖి, దేవస్పర్శమ్, మైథిలి వీన్‌డుమ్ ఓరుమ్ లాంటి పాపులర్ ధారావాహికలతో పాటు మేఘతీర్థం, ఆచయన్స్, కల్కి వంటి చిత్రాల్లో అపర్ణా పి నాయర్ నటించారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా పి నాయర్‌కు ఇద్దరు పిల్లలున్నారు.
