మలయాళ స్టార్ విజయ్ బాబు మరోసారి అరెస్ట్ అయ్యారు.ఆయన ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిల్ పైన బయట ఉన్నారు. తాజాగా ఆయనను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.

మలయాళ స్టార్ విజయ్ బాబు మరోసారి అరెస్ట్ అయ్యారు.ఆయన ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిల్ పైన బయట ఉన్నారు. తాజాగా ఆయనను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.

మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌బాబు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో చాన్స్‌ ఇప్పిస్తానని విజయ్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై ​కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కొన్ని నెలల క్రితం విజయ్‌ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పొందాడు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా అతడు ఇటీవల సోషల్‌ మీడియాలో బాధిత నటి పేరును వెల్లడించాడు. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్‌ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది.

కొచ్చిలోని ఒక ఫ్లాట్‌లో తనపై ప‌లుమార్లు లైంగిక దాడి జరిగింద‌ని.. తన అసభ్యకరమైన వీడియోను కూడా విజ‌య్ బాబు రికార్డ్ చేశారని మహిళ ఆరోపించింది. లైంగిక దాడికి ముందు తాను మద్యం మత్తులో ఉన్నానని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఏప్రిల్ 22న విజయ్ బాబుపై మ‌హిళ‌ ఫిర్యాదు చేసింది. కానీ అతనిపై చర్యలు తీసుకోవడం లేట్ అయ్యింది. 

వెంటనే.. విజయ్ బాబు బుధవారం తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రత్యక్షమ‌య్యాడు. ఈ కేసులో అసలు బాధితుడు' తానేనని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజ‌య్ బాబు చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదు.. మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని విజయ్ బాబు అన్నాడు.