Asianet News TeluguAsianet News Telugu

మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. ఏడాదిలో రెండు ఘటనలు.. శోకసంద్రంలో మలయాళ సూపర్ స్టార్

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టీ ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరి కూడా తుదిశ్వాస విడిచారు. 
 

Malayalam Actor Mammoottys Sister passed Away NSK
Author
First Published Sep 12, 2023, 3:42 PM IST

మలయాళం స్టార్ మమ్ముట్టి (Mammootty)  ఇంట్లో వరుస విషాదాలు ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. కొన్ని నెలల కిందనే మమ్ముట్టీ తల్లిగారు అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకునే లోపే తాజాగా సోదరి అమీనా (70) తుదిశ్వాస విడిచారు. ఆమె అనారోగ్యంతో కొన్ని నెలలుగా ఆస్ప్రతిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషయమించి ఈరోజు  కన్నుమూశారు. 

ఏడాదిలోనే రెండు విషాద ఘటన చోటుచేసుకోవడంతో మమ్ముట్టీ కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది. అభిమానులు కూడా చింతిస్తున్నారు. అమీనా మమ్ముట్టికి చెల్లెలు అవుతుంది. ఆమెకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లు ఉన్నారు. అమీనా మరణంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికన కామెంట్లు పెడుతున్నారు. 

మరోవైపు మమ్ముట్టి చెల్లి మరణంతో సినీ ప్రముఖులు,సెలెబ్రెటీలు ఆయనకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 13న) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక.. రీసెంట్ గానే మమ్ముట్టీ 72వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా ఎమోషనల్ విషెస్ తెలిపారు. మమ్ముట్టీ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. 

‘స్వాతి కిరణం’, ‘యాత్ర’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. ఈ ఏడాది అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏజెంట్’ (Agent) చిత్రంతో  కీలక పాత్ర పోషించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ప్రస్తుతం ‘బ్రహ్మయుగం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios