అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి!

అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి!

ప్రముఖ మలయాళ నటుడు కళాశాల బాబు(63) ఆదివారం రాత్రి మృత్యువాత పడ్డారు. గత కొంత కాలంగా గుండె, మెదడు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన కొచ్చిలోని ఓ అమృతా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది.శోక సంద్రంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు.

1955లో జన్మించిన కళాశాల బాబు 'ఇనయేతేడి' అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.కొన్నేళ్ళ పాటు సినిమాలలో నటించిన ఆయన 1999లో కాలా అనే సీరియల్ లో నటించారు. ఇందులో విలన్ పాత్రలో కనిపించి అందరి మన్ననలు పొందారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇద్దరు పిల్లలు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos