ఆ అశ్లీల వీడియో నాది కాదు, నాకు మెస్సేజ్ లు పంపవద్దు ప్లీజ్... నటి ఆవేదన!

మలయాళ నటి రమ్య సురేష్ పెద్ద సమస్యలో ఇరుకున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ అస్లీల వీడియోలో ఉంది రమ్య సురేష్ అంటూ ప్రచారం సాగుతుంది. 
 
 

malayala actress ramya suresh clarifies on that private video circulating in internet on her name ksr


నటులకు సోషల్ మీడియా వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల బెడద ఎప్పుడూ ఉండేదే. కేటుగాళ్లు తమ ప్రయోజనం కోసం సెలెబ్రిటీల ఫేమ్ ని వాడుకోవడమో, వాళ్ళని డిఫేమ్ చేయడమో చేస్తూ ఉంటారు. తాజాగా మలయాళ నటి రమ్య సురేష్ పెద్ద సమస్యలో ఇరుకున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ అస్లీల వీడియోలో ఉంది రమ్య సురేష్ అంటూ ప్రచారం సాగుతుంది. 

ఈ విషయం తెలుసుకున్న రమ్య సురేష్ షాక్ తినడంతో పాటు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదని.. తనకి ఆ వీడియోతో ఎలాంటి సంబంధంలేదని ఆమె స్పష్టం చేశారు. మలయాళంలో తెరకెక్కిన పలు చిత్రాల్లో సహాయనటిగా నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రమ్య సైబర్‌ పోలీసులను ఆశ్రయించడంతో పాటు కేసునమోదు చేసినట్లు సమాచారం. . ఈ విషయం గురించి తెలియజేస్తూ తాజాగా ఆమె సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.  'గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న అశ్లీల వీడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నెట్ లో వీడియో చూసి నేను షాక్ తిన్నాను. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి కొంచెం అటు ఇటుగా నాకు మాదిరిగానే ఉన్నాయి.

దాంతో ఆ వీడియో చూసిన చాలామంది నాకు అసభ్యకరమైన మెస్సేజ్‌ లు పంపిస్తున్నారు. వాటిని చూసి ఎంతో బాధగా అనిపించింది. నా భర్త సపోర్ట్‌తో సైబర్‌ పోలీసులను ఆశ్రయించి.. కేసు నమోదు చేశాను. వాళ్లు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. దయచేసి, ఇకపై ఆ వీడియో గురించి నాకు మెస్సేజ్‌లు పంపించకండి' అని రమ్య విజ్ఞప్తి చేసుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios