యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఈ ఏడాది గ్రాండ్ విక్టరీ దక్కింది. బాహుబలి తర్వాత ఊరిస్తూ వచ్చిన విజయం కల్కి 2898 ఎడి చిత్రంతో దక్కింది. కల్కి చిత్రం 1000 కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఈ ఏడాది గ్రాండ్ విక్టరీ దక్కింది. బాహుబలి తర్వాత ఊరిస్తూ వచ్చిన విజయం కల్కి 2898 ఎడి చిత్రంతో దక్కింది. కల్కి చిత్రం 1000 కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది.
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మాళవిక మోహనన్
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఎగిరి గంతేసి ఆఫర్ అందుకుంటారు. కానీ ఒక బోల్డ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. ఇది నిజంగా ఫ్యాన్స్ కి షాకింగ్ విషయమే అని చెప్పొచ్చు. ప్రభాస్ చిత్రాన్నే రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్. తన అందంతో మాళవిక సోషల్ మీడియాలో ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బాహుబలికి పెద్ద అభిమానిని..
ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. బోల్డ్ గా గ్లామర్ ప్రదర్శిస్తూ మాళవిక యువతని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఇంతకీ మాళవిక మోహనన్ రిజెక్ట్ చేసిన చిత్రం ఏంటని అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళదాం.
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. అయితే ప్రశాంత్ నీల్ ముందుగా ఈ అవకాశాన్ని మాళవిక మోహనన్ కి ఇచ్చారట. ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్. ఆ చిత్రాలు చూశాక ఒక్కసారి అయినా ప్రభాస్ తో కలసి నటించాలని అనుకున్నా.
సలార్ మూవీ రిజెక్ట్ చేశా
కొన్నేళ్ల తర్వాత ప్రశాంత్ నీల్ గారు నాకు సలార్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది అద్భుతమైన అవకాశం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ ని నేను ఉపయోగించుకోలేకపోయాను. కొన్ని కారణాల వల్ల సలార్ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు మాళవిక మోహనన్ తెలిపింది. ఫైనల్ గా ప్రభాస్ తో కలసి నటించడం రాజా సాబ్ చిత్రంతో జరుగుతోంది. ఇది కూడా క్రేజీగా ఉండే చిత్రం. హర్రర్ కామెడీ, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కుతోంది అని మాళవిక పేర్కొంది.
హర్రర్ కామెడీ చిత్రంగా రాజా సాబ్
మారుతీ స్టైల్ లో కామెడీ ఉంటూనే ప్రభాస్ స్టైల్ లో యాక్షన్ కూడా ఉండబోతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం భారీ సెట్లు నిర్మించారు. రాజా సాబ్ చిత్రం కోసం ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ నిర్మించినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇంత భారీ సెట్ ని ఇంతవరకు ఎవరూ నిర్మించలేదు. 40 వేల చదరపు అడుగుల ఫ్లోర్ లో ఈ సెట్ ని నిర్మించినట్లు తెలిపారు. ఇదికాక ఇంకా చాలా సెట్లు ఉన్నాయి. కానీ సినిమా ఎక్కువ భాగం జరిగేది ఈ సెట్ లోనే. దాదాపుగా షూటింగ్ చివరి దశకి చేరుకుంది.
రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా నటిస్తున్నారు. తొలిసారి హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ చేస్తున్న చిత్రం ఇది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ చిత్రాల లైనప్ భారీగా ఉంది. స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 ఇలా భారీ బడ్జెట్ చిత్రాలని ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ హోంబాలే ఫిలిమ్స్ తో మూడు చిత్రాలకు భారీ డీల్ సెట్ చేసుకున్నారు.
