Malaika Arora :బాలీవుడ్ నటి మలైకా అరోరా తన స్టైల్ వేరు అని మరోసారి నిరూపించుకుంది. లగ్జరీ కారు కోసం ఖరీదైన ఫ్లాట్ అమ్మేసింది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

భారీ ధరకి ఫ్లాట్ అమ్మేసిన మలైకా

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇటీవల చేసిన ఒక నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చాలా మందికి ఇది వింతగా అనిపించినా, ఆమె తన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. మలైకా తాజాగా ముంబైలోని ఆంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఫ్లాట్‌ను రూ.5.30 కోట్లకు విక్రయించారు.

ఈ అమ్మకాల నుండి వచ్చిన మొత్తంలో సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి, అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. సమాచారం ప్రకారం, ఈ కొనుగోలుకు సంబంధించిన పత్రాల ప్రక్రియను నిన్న పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మలైకా ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇల్లు అమ్మి కారు కొనడం అవసరమా అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత నిర్ణయం కాబట్టి విమర్శించాల్సిన పనిలేదని చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు

సాధారణంగా బాలీవుడ్ నటీనటులు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. ఫ్లాట్లు కొనుగోలు చేసి, కొన్నేళ్ల తర్వాత వాటిని అమ్మి లాభాలు ఆర్జించడం వారి అలవాటుగా మారింది. అదే విధంగా మలైకా కూడా తన పెట్టుబడి ద్వారా మంచి లాభం పొందినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం, ఆమె అమ్మిన ఫ్లాట్‌పై సుమారు 62% లాభాన్ని సాధించారు. ఆ లాభంలో కొంత భాగాన్ని లగ్జరీ కార్ కొనుగోలుకు ఉపయోగించారు. ఈ చర్యతో మలైకా వ్యక్తిగత జీవనశైలి, ఆర్థిక ప్రణాళికపై అభిమానులు, సినీప్రేమికులు చర్చిస్తున్నారు.

మలైకా అరోరా తరచూ తన ఫ్యాషన్ సెన్స్, ఫిట్‌నెస్ రూటీన్, వ్యక్తిగత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా రేంజ్ రోవర్ కొనుగోలు కూడా ఆమె లైఫ్ స్టైల్‌లో మరో ముఖ్యమైన అడుగుగా నిలిచింది.