బాలీవుడ్ నటి మలైకా అరోరా.. తన భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకోవడం గురించి తాజాగా రేడియో షోలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దాదాపు పదిహేను సంవత్సరాలు కలిసి తమ వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు. 

పాత రోజులను గుర్తు చేసుకున్న మలైకా.. తన పెళ్లి బ్రేకప్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేసింది. జీవితంలో తీసుకునే అన్ని నిర్ణయాల మాదిరి ఆ నిర్ణయాన్ని(పెళ్లిని రద్దు చేసుకోవడం)తీసుకోవడం కష్టమని చెప్పింది.

మరిన్ని విషయాలను చెబుతూ.. ''నేను అర్భాజ్ అన్ని కోణాల్లో ఆలోచించాం. ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకుంటే మంచిదని నిర్ణయించుకున్నాం. మా మధ్య  అభిప్రాయభేదాలు వచ్చాయి. ఒకరినొకరం చాలా బాధ పెట్టుకున్నాం. దాని వల్ల మా చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో బాధపడ్డారు. కాబట్టి విడిపోయి దూరంగా ఉండడమే మంచిదని అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్.