Asianet News TeluguAsianet News Telugu

కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఐటమ్‌ బ్యూటీ అపార్ట్‌మెంట్

ముంబై నగరంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 90 వేలకు పైగా కేసులతో మహారాష్ట్రలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలో మలైక నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

Malaika Arora building become Containment zone mumbai
Author
Hyderabad, First Published Jun 11, 2020, 2:04 PM IST

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రధాన నగరాల్లో వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది, ఇప్పటికే కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ముందు ముందు మహమ్మారి మరింత విజృంభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులకు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్‌ ఇలాంటి సమస్యే ఎదురైంది.

ముంబై నగరంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 90 వేలకు పైగా కేసులతో మహారాష్ట్రలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలో మలైక నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె నివసిస్తున్న బిల్డింగ్‌ను క్వారెంటైన్‌ జోన్‌గా మార్చారు. జూన్‌ 8 నుంచి బిల్డింగ్‌ సీల్ చేసినట్టుగా తెలుస్తోంది.

లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి ఇంటికే పరిమితమైన మలైకా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. తన స్నేహితులతో కలిసి లైవ్‌ చాట్‌ చేసిన సంఘటనలతో పాటు తన వర్క్‌ అవుట్ అప్‌డేట్స్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు బయట పరిస్థితులు ఎలా ఉన్నా.. తాను వర్క్‌ అవుట్, యోగా చేయటం లాంటివి ఎప్పుడూ మానుకోనంటూ ట్వీట్ చేసింది మలైకా.

Follow Us:
Download App:
  • android
  • ios