బాలయ్య ఫ్యాన్స్ కు ‘వీరసింహారెడ్డి’ న్యూ ఇయర్ ట్రీట్.. మాసీవ్ మేకింగ్ వీడియో రిలీజ్!
నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ నుంచి న్యూ ఇయర్ ట్రీట్ అందింది. మాస్ విజువల్స్ తో కూడిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మాస్ ఎలిమెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

కొత్త సంవత్సరం కానుకగా నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్ గా Veera Simha Reddy మాసీవ్ మేకింగ్ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది.
ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మేకింగ్ వీడియోను వదలడం మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మాస్ యాక్షన్ సీన్స్, టేకింగ్ అదరిపోయినట్టు తెలుస్తోంది. రాయలసీయ, తదితర పాత్రాల్లో చిత్రీకరించిన మాస్ విజువల్స్ తో కూడిన మేకింగ్ వీడియోను వదిలారు. సెట్స్ లో బాలయ్య జోష్, చిత్ర యూనిట్ వర్క్ స్టైల్ అదిరిపోయింది. మరోవైపు మేకింగ్ వీడియోలో నందమూరి మోక్షజ్ఞ కూడా కనిపించడం విశేషం. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన మేకింగ్ వీడియో పట్ల బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లైక్స్ తో వైరల్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మాలినేని డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుదిమెరుపులు దిద్దుకుంటూ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.