Asianet News TeluguAsianet News Telugu

మెగా ఫ్యామిలీ నుండి అతడే ఫస్టా?

మెగాహీరో ధరమ్ తేజ్ గత ఏడాది ప్రతిరోజూ పండగే చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ధరమ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలపై ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.  

Makes in the plans to release solo brathuke so better in ott
Author
Hyderabad, First Published Aug 13, 2020, 8:16 PM IST

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఓ స్థాయి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అరంగేట్రం అద్భుతంగా చేసిన ఈ హీరో తరువాత విజయాల పరంగా వెనుకబడ్డాడు. ఐతే గత ఏడాది చివర్లో వచ్చిన ప్రతిరోజూ పండగే చిత్రం ఈయన జీవితంలో వెలుగు తెచ్చింది అనాలి. చాలా కాలం తరువాత ఓ పర్ఫెక్ట్  హిట్ కొట్టాడు. సాయి  ధరమ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఆ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. దర్శకుడు మారుతీ, ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించి భారీ హిట్ కొట్టాడు. 

ఈ మూవీ తరువాత ధరమ్ తేజ్ సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్  ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని డైరెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి 'నో పెళ్లి సాంగ్' విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓ టి టి లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఓ టి టి సంస్థలతో బేరసారాలు మొదలుపెట్టారట. మంచి డీల్ దొరికితే ఓ టి టి విడుదల ఖాయం అట. థియేటర్స్ ద్వారాలు ఇప్పట్లో తెరుచుకొనేలా కనిపించడం లేదు. దీనితో చిన్న మరియు మధ్య తరహా బడ్జెట్ చిత్రాలు ఓ టి టి వైపు చూస్తున్నాయి. 


ఇప్పటికే హీరో నాని నటించిన వి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. వచ్చే నెలలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.  మరి సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఓ టి టి లో అందుబాటులోకి వస్తే మెగా ఫ్యామిలీ నుండి ఫస్ట్ ఎంట్రీ ఆయనదే అవుతుంది. సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నభా  నటేష్ హీరోయిన్ గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత ధరమ్ దర్శకుడు దేవా కట్టాతో చిత్రం చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios