ఒక షెడ్యూల్ పూర్తయ్యిందో లేదో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారట. ఈ మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.  

ఒకటికి నాలుగు చిత్రాలు పట్టాలెక్కించారు పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు నత్త నడక సాగుతుంటే, మిగతా చిత్రాలను మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల మొదలైన వినోదయసితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తమిళ చిత్రం తేరి రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ పక్కన పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ వద్ద తీసుకున్న అడ్వాన్స్ కోసం పవన్ తేరీ రీమేక్ కి కమిట్ అయ్యారు. 

హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. 8 రోజులు జరిగిన ఈ షెడ్యూల్ నందు ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పిల్లలతో ఫన్నీ సన్నివేశాలు, హీరోయిన్ శ్రీలీలతో రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించారనే ప్రచారం జరిగింది. రామ్ లక్షణ్ పర్యవేక్షణలో వంద మందితో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ లో తలపడ్డారట. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్ట్స్ ఈ ఫైట్ లో పాల్గొన్నారని సమాచారం. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు ఎడిటింగ్ పూర్తి చేస్తున్నారట. ఫస్ట్ షెడ్యూల్ లో తెరకెక్కించిన సన్నివేశాల ఎడిటింగ్ మొదలుపెట్టారట. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఫోటోలు విడుదల చేశారు. అలాగే త్వరలో బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారట. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ స్పీడ్ చేస్తుంటే రానున్న ఆరు నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల చేస్తారనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారు. 

వినోదయ సితం 2023లోనే విడుదల కానుందని సమాచారం. మరి ఓజీ పరిస్థితి తెలియాల్సి ఉంది. ఓజీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఎటొచ్చి హరి హర వీరమల్లు మాత్రం అయోమయంలో పడింది. రానున్న ఐదారు నెలల్లో ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి పొలిటికల్ గా బిజీ కావాలని పవన్ చూస్తున్నారనిపిస్తుంది.