జవాన్ మీద ... ఈ సినిమా వేయటం చాలా మందిని ఆశ్చర్యపడేసింది. అయితే #MissShettyMrPolishetty టీమ్ మాత్రం..షారూఖ్ హవా కేవలం ...


అనుష్క సినిమలకు ఉండే క్రేజే వేరు. అలాగే భాక్సాఫీస్ దగ్గర నవీన్ పోలిశెట్టికు ఓ రేంజి క్రేజ్ ఉంది. దాంతో వీరి కాంబో అంటే అరాచకమే అని అందరూ భావించారు. దానికి తోడు అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నిన్న గురువారం (సెప్టెంబర్‌ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తూ మరో భారీ సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. అదే జవాన్‌.

జవాన్ మీద ... ఈ సినిమా వేయటం చాలా మందిని ఆశ్చర్యపడేసింది. అయితే #MissShettyMrPolishetty టీమ్ మాత్రం..షారూఖ్ హవా కేవలం నైజాం కే పరిమితం అవుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే దైర్యంగా ఈ భారీ సినిమాపై వేసారు. అందులోనూ పూర్తి ఆపోజిట్ జానర్ కావటంలో ఫ్యామిలీస్ ఖచ్చితంగా తమవైపే వీకెండ్ లో మ్రొగ్గుచూపుతారని భావించారట. అయితే #Jawan హవా ముందు ఈ లాజిక్ లు ఏమీ పనిచేయటం లేదు. దాంతో #MissShettyMrPolishetty వేరే రిలీజ్ డేట్ లో వచ్చి ఉంటే ఖచ్చితంగా కలెక్షన్స్ బాగుండేవి అంటున్నారు. టాక్ బాగున్నా...కలెక్షన్స్ ఆ స్దాయిలో లేకపోవటం అభిమానులను బాధిస్తున్న విషయం.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ #MissShettyMrPolishetty కి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల అయ్యింది. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా వచ్చింది. 'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‍ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో నటించారు. సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వంశీ - ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి రధన్ సంగీతం సమకూర్చారు.

ఇక జవాన్ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించడం, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం, క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం, తమిళ స్టార్‌ విజయ్‌సేతుపతి విలన్ గా నటించడం, దీపికా పదుకునే అతిథి పాత్రలో మెరవడం.. ఇలా చాలానే ఉన్నాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. 

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావటమే కాదు.ఒకే ఓటీటీ పార్ట్‌నర్స్‌తో డీల్‌ కుదుర్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ రూ.120 కోట్లు పెట్టి మరీ జవాన్‌ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, జవాన్‌.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.