కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) స్క్రీన్ ప్లే అందించటం ఈ సినిమాకి ఒక ప్లస్ అయింది. అలాగే ఈ సినిమాకి సంగీత నేపధ్యం, ఛాయాగ్రహణం కూడా చాలా బావున్నాయి.


సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రంనిన్న శుక్రవారం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు ఆడియెన్స్ ను, ఇటు క్రిటిక్స్ ను ఈ మూవీ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి విడుదల విషయం హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కలు అయితే దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది అని చెప్పాలి. మే చివరి వారంలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. 

ఈ సినిమా బాగుందా..నచ్చుతంగా అంటే...హారర్ థ్రిల్లర్ జోనర్ నుఇష్టపడే వారికి ఈసినిమా విపరీతంగా నచ్చుతుంది ఆలాగే మిగతావారికి కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తే విరూపాక్ష మంచి ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. అయితే ఎక్సపెక్టేషన్స్ లేకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. చిత్రం కథేమిటంటే...

ఈ సినిమా పీరియడ్ లుక్ లో అప్పటి కాలంలో జరుగుతూంటుంది. ఇప్పుడైతే చేతబడులు ఎక్కడున్నాయి అని అడిగే అవకాస ఉంది కాబట్టి ఆ టైమ్ తీసుకున్నట్లున్నారు. 1979 లో రుద్రవరం ఊళ్లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ జంటను సజీవ దహనం చేసేస్తారు ఆ ఊరి జనం. వాళ్ళు చనిపోతూ ఆ ఆక్రోశంలో ...ఊరు మొత్తం 12 సంవత్సరాల తర్వాత వల్లకాడు అవుతుందని, అందరూ చనిపోతారని శాపం పెడతారు. అనుకున్నట్లుగానే పుష్కర కాలం తర్వాత ఆ ఊళ్లో చావులు మొదలౌతాయి. ఊరిని మంత్రాలతో అష్ట దిగ్బంధనం చేసినా ఫలితం ఉండదు.

 అదే సమయంలో జాతరకు త‌న త‌ల్లితో క‌లిసి బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్‌) ...అక్కడ ఆ ఊరి అమ్మాయి నందిని (సంయుక్త‌) (Samyuktha)పై మనస్సు పడతాడు. ఆ ఊరి పరిస్దితులు చూసి వెళ్లిపోదామనుకున్నా తన ప్రేమించిన అమ్మాయి ఆపదలో పడటంతో ఆమెను కాపాడ‌టం కోసం మ‌ళ్లీ ఊళ్లోకి తిరిగొస్తాడు. దాంతో అసలు మరణాలు వెనక ఉన్న మిస్టరీని ఛేదించ‌డానికి న‌డుం బిగిస్తాడు. అప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయిటకు వస్తాయి. అవే ఏమిటి... ఆ ఊరిలో మరణాలను సూర్య ఆపగలిగాడా.. ఆ మరణాలకు కారణం అప్పటి శాపమేనా లేక మరేదన్నానా ?అన్నది మిగ‌తా క‌థ.