మే 27న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతo చేసుకున్న చిత్రం ‘ఎఫ్3’. ప్రస్తుతం ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ రిలీజ్ పైనా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  

వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్ గా నటించారు. అందాల విందు చేస్తూ బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు. మే27న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఆడియెన్స్ ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలలో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే, తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సరిగ్గా 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అంటే దాదాపు 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సినిమాను థియేటర్లలోనే ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను సోనీ LIVE రూ.18 కోట్లకు దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మున్ముందు మరింత సమాచారం అందించనున్నారు. 

అటు కలెక్షన్స్ లోనూ F3 కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. సాధారణ టికెట్ రేట్లతోనూ ఇంతలా కలెక్షన్స్ సాధించడం విశేషం. మొదటి వీకెండ్ పూర్తయ్యే వరకు రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం థియేటర్లలో ఎఫ్3 సందడి కొనసగుతూనే ఉంది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డే కూడా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. 

Scroll to load tweet…