స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా కీర్తి తన ఫీలింగ్స్ మరియు మూవీ అప్డేట్స్ పంచుకుంటారు. తాజాగా కీర్తి మేకప్ లేకుండా కనిపించి తన ఫ్యాన్స్ కి చిన్న షాక్ ఇచ్చారు. ఇంట్లో ప్రశాంతంగా గులాబ్ జామ్ తింటున్న కీర్తి 'ఆదివారం చీటింగ్ డే' అంటూ కామెంట్ పెట్టారు. ఆమె కామెంట్ సంగతి అటుంచితే మేకప్ లేకుండా కీర్తి భిన్నంగా కనిపించారు. 

ఐతే మిగతా హీరోయిన్స్ తో పోల్చితే కీర్తి మేకప్ లేకుండా కూడా అందంగానే ఉన్నారు. గ్లామర్ కాకుండా టాలెంట్ నే నమ్ముకున్న కీర్తి, తాను సహజ సుందరి అని నిరూపించుకున్నారు. మహానటి తరువాత కీర్తి సురేష్ ఫేమ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుండి ఫేడ్ అవుట్ అవుతుందనుకున్న సమయంలో మహానటి రూపంలో ఆమెకు లైఫ్ వచ్చింది. ఆ సినిమా కీర్తికి ఏకంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. 

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కించనుండగా మూవీపై భారీ అంచనాలున్నాయి అలాగే కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.