Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన తాజా చిత్రం ‘మేజర్’.  ఈ మూవీ ఎంతటి  విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
 

Major Movie Ready to give entry to OTT, Since when is streaming?
Author
Hyderabad, First Published Jun 30, 2022, 6:34 PM IST

తెలుగు బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన చిత్రం ‘మేజర్’. ఈ మూవీని 2008 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ముంబయి దాడుల్లో టెర్రరిస్టులను సందీప్ ఎలా మట్టుబెట్టాడో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు శశి కిరణ్ తిక్క. రెండేండ్ల కింద షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.  రిలీజ్ కు ముందే చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రచారం చేయడం భారీ హైప్ నిచ్చింది.. అంతేకాకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అభిమానుల కోసం ప్రీ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో విడుదల తేదీకి ముందుగానే రిలీజ్ చేసి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

గ్రాండ్ రిలీజ్ తర్వాత కూడా మేజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీని చూసిన పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా Major టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఇండియన్ ఆర్మీకి చెందిన  పలువురు ఆఫీసర్స్ కూడా మేజర్ చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. మరోవైపు మేజర్ అటు హిందీ బెల్ట్ లోనూ సౌత్ సినిమా సత్తాను చూపించింది. ఇక బాక్సాఫీస్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.

సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొంతశాతం ఆడియెన్స్ మేజర్ ఓటీటీ (Major Ott) రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ గుడ్ న్యూస్ చెబుతూ మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మేజర్ చిత్రం రిలీజ్ కానుంది. వచ్చే నెల జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అంటే మరో రెండు రోజుల్లో మూవీ ఓటీటీలో సందడి చేయనుంది.

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) మేజర్ పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సాయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శశికిరణ్ తిక్క ఇంట్రెస్టింగ్ బ్లాక్స్, అదిరిపోయే ఫ్రేమింగ్ తో తన మార్క్ చూపించాడు. ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ పలు కీలక పాత్రలో నటించారు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios