Asianet News TeluguAsianet News Telugu

'సర్కారు వారి పాట' లో మేజర్ హైలెట్

 గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే సర్కారువారి పాట సినిమాతో తొలిసారి కీర్తిసురేష్ మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

Major highlight of Sarkaru Vaari Paata
Author
Hyderabad, First Published Sep 18, 2021, 12:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


మహేష్ బాబు అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట' .పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం  కోవిడ్‌ బ్రేక్‌లతో లేటైనా ఇప్పుడు మాత్రం  షూటింగ్‌ జోరుగా జరుగుతోంది.  బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ గా హైలెట్ గా నిలిచే సీన్స్ కొన్ని తీసినట్లు  వినికిడి.

 ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మహేష్-సముద్రఖని మధ్య కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బ్యాంక్ సెట్‌లో వీటి షూటింగ్ జరిగింది. మహేష్-సముద్రఖని మధ్య జరిగే  సీన్స్ ఓ రకమైన ఛాలెంజ్ తో ఉంటాయని, థియేటర్ లో అద్బుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట.  సముద్రఖని పాత్ర ఈ సినిమాలో చాలా ఫవర్ ఫుల్‌గా సాగుతుందని సమాచారం.

ఇదిలా ఉండగా రీసెంట్ గా షూటింగ్ లొకేషన్  నుంచి లీకైన బుల్లెట్ పై మహేష్ బాబు స్టైలిష్‌గా ఉన్న ఫొటో ప్రస్తుతం నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.  అలాగే సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే రికార్డులు క్రియేట్ చేయటం మొదలు పెట్టింది. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ రికార్డ్ స్దాయిలో వ్యూస్ సాధించి యూట్యూబ్‌‌‌‌లో ట్రెండింగ్‌‌‌‌లో కొనసాగుతోంది. ఈ టీజర్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని పెంచేసింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో హీరో తండ్రి ఒక బ్యాంక్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడు. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. దాంతో రంగంలోకి దిగిన హీరో..ఆ బిజినెస్ మెన్‌తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. అలాగే అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందట ఈ మూవీలో.  

ఈ సినిమా గురించి ఉన్న సమాచారం మేరకు  మహేష్ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్‌‌‌‌గా ఈ సినిమాలో కనిపించనున్నాడు.  2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.  

భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత  మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట. 

Follow Us:
Download App:
  • android
  • ios