హనుమాన్ కు ముందున్న ఇమేజ్ వేరు. ఇప్పుడు ‘హ‌నుమాన్‌’తో వ‌చ్చిన ఇమేజ్ దృష్ట్యా ఈ క‌థ‌లో కొన్ని మార్పులు అవ‌స‌రం అయ్యాయంటున్నారు.  


యంగ్ హీరో తేజ స‌జ్జా దశ ..ఒక్కసారిగా హనుమాన్ హిట్ తో తిరిగిపోయింది. ఇప్పుడు అతను ప్యాన్ ఇండియా హీరో అయ్యారు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ బిజీగా క‌నిపిస్తున్నాడు.'జాంబిరెడ్డి'తో హీరోగా ప‌రిచ‌య‌మైన తేజ అటు పై చేసిన రెండు ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌న‌ప్ప‌టికీ హనుమాన్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆఫర్స్ మీద ఆఫర్స్ . అయితే ఆచి తూచి అడుగులు వేయాల్సిన టైమ్. ట్యాలెంట్ తో ఛాన్సులు ఒడిసి ప‌ట్టుకుంటున్నా ప్లానింగ్ లేకపోతే దెబ్బ తింటానని అతనికి తెలుసు. అందుకే నెక్ట్స్ సినిమాకు ఖచ్చితంగా 'హ‌నుమాన్' బజ్, ఇమేజ్ కలిసి వస్తుందని తెలుసు. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజెక్టు ‘మిరాయ్‌’తో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో ‘మిరాయ్‌’లో భారీ మార్పులు చేస్తున్నారని మీడియా టాక్. 

‘మిరాయ్‌’ చిత్రాన్ని‘హ‌నుమాన్‌’ విడుద‌ల కంటే ముందే కమిటయ్యాడు. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో మంచు మ‌నోజ్ విలన్ గా క‌నిపించ‌నున్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. `హ‌నుమాన్` విడుద‌ల‌కు ముందే కొంత‌మేర షూటింగ్ జ‌రిగింది. త్వ‌ర‌లో కొత్త షెడ్యూల్ మొద‌లుకానుంది. ఈ క్రమంలో ‘మిరాయ్‌’లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. హనుమాన్ కు ముందున్న ఇమేజ్ వేరు. ఇప్పుడు ‘హ‌నుమాన్‌’తో వ‌చ్చిన ఇమేజ్ దృష్ట్యా ఈ క‌థ‌లో కొన్ని మార్పులు అవ‌స‌రం అయ్యాయంటున్నారు. స్క్రిప్టు ని మ‌ళ్లీ రీ రైట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గోవాలో స్క్రిప్టు డిస్కషన్స్ జరుగుతున్నట్లు వినికిడి. పాన్ ఇండియా ప్రేక్ష‌కుల్ని దృష్టిలో ఉంచుకొని యాక్ష‌న్‌ పార్ట్ పెంచుతన్నారట. అలాగే కొన్ని రీషూట్స్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ వ్య‌యంతో నిర్మిస్తోంది. 

ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని డైరక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కార్తీక్ అదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణ‌సంస్థ‌లో ర‌వితేజ హీరోగా' ఈగ‌ల్' చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆ సినిమా మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆ రిలీజ్ తో సంబంధం లేకుండానే కార్తిక్ ప‌నిత‌నం మెచ్చిన పీపూల్ మీడియా ప్యాక్ట‌రీ ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది.అయితే రవితేజ చిత్రం ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు. ఇక మిరాయి అంటే? ఇదొక జ‌ప‌నీస్ ప‌దంగా తెలుస్తోంది. అంటే భ‌విష్య‌త్ అని అర్ధం. ఇందులో హీరోని భ‌విష్య‌త్ లోకి తీసుకెళ్లి? ఆ కాలంలో ఏం జ‌ర‌గ‌బోతుంది? అన్న‌ది క‌థ‌లో హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు వినిపిస్తుంది.