అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన నూతన చిత్రం 'మజిలీ'. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 'నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను.

ఈలోపు నువ్ సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. క్రికెట్ ఆడే సమయంలో చైతు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. ఆ తరువాత సమంతతో పెళ్లి జరుగుతుంది.

కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక భార్యని ఇబ్బంది పెడుతుంటాడు. 'నువ్వు నా రూమ్ లోకి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు' అంటూ చైతు.. సమంతతో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

టీజర్ మొత్తానికి గోపి సుందర్  అందించిన నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.