మొత్తానికి మజిలీ సినిమాతో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. కెరీర్ లో 50 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసి తన మార్కెట్ ను మరింతగా పెంచుకుంటున్నాడు. సమంత స్టార్ డమ్ కూడా సినిమాకు ఉపయోగపడింది. ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటోంది. 

సెకండ్ వీక్ కూడా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఇక ఓవర్సీస్ లో సైతం చైతు చితక్కొట్టేసున్నాడు. 1 మిలియన్ డాలర్స్ తో విదేశాల్లో సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. యూఎస్ లో $775k కలెక్ట్ చేసిన మజిలీ ఆస్ట్రేలియాలో 58 వేల డాలర్లను రాబట్టింది. ఇక అరబ్ కంట్రీస్ ఇతర దేశాల్లో మొత్తంగా 20వేల డాలర్స్ ను అందుకున్న చైతూ సినిమా తొందరగానే 1 మిలియన్ మార్క్ ను అందుకుంది. 

గత సినిమాలతో పోలిస్తే అక్కినేని హీరోకి మజిలీ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంతతో పాటు కొత్తమ్మాయ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.