సమంత - నాగ చైతన్య పెళ్లి అనంతరం మొదటిసారి కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ సినిమాపై ఆడియెన్స్ తో పాటు సినీ ప్రముఖుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మొత్తం సినిమాపై ఓ లుక్కేసినట్లు తెలుస్తోంది. సమంత భర్త కు తన ద్వారా హిట్టివ్వడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. 

పెళ్లితో మొదలెయ్యే ఈ కథలో సెకండ్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. చైతు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ ఫెయిల్యూర్ అయ్యే సీన్స్ అనంతరం సమంత ఆయనకు దగ్గర అయ్యేందుకు చేసే ప్రయత్నాలు తెలియని భావోద్వేగాన్ని కలిగిస్తాయట. కొన్ని సన్నివేశాలు హెవీ ఎమోషన్స్ తో గుండెను బరువెక్కిస్తాయని చెబుతున్నారు. 

నిన్ను కోరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ మరోసారి ఎమోషనల్ గా కదిలించనున్నాడని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టాలని చైతు కసి మీద ఉన్నాడు. అయితే సీనిమా రిలిజ్  డేట్ పై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా ఎలక్షన్స్ కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నప్పటికీ చిత్ర సభ్యులు మాత్రం సోషల్ మీడియాలో సినిమా అనుకున్న సమయానికి రానున్నట్లు చెబుతున్నారు.