సమంత, నాగ చైతన్య జంటగా నటించిన 'మజిలీ' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో అతడికి మంచి పేరు దక్కింది.

ఎమోషనల్ కథలను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా తెరకెక్కించే దర్శకుడిగా శివ నిర్వాణకి మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు మజిలీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న శివ నిర్వాణకి మరొక సంతోషాన్నిచ్చే అనుభవం ఎదురైంది.

ఆయన పండంటి మగబిడ్డకి తండ్రయ్యాడు. ఈ విషయాన్ని శివ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శివకి విషెస్ చెబుతున్నారు.