ఆ స్టార్ హీరో సినిమాలో నటించి జీవితం నాశనం చేసుకున్నా: నటి ఆవేదన

First Published 23, Jul 2018, 12:06 PM IST
mahie gill regrets doing with salman khan in film dabangg
Highlights

2010లో విడుదలైన 'దబాంగ్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా సోనాక్షి నటించగా.. మరో ముఖ్య పాత్రలో మహి గిల్ నటించింది. అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పక్కన నటించిన కారణంగా తనకు అలాంటి చిన్న చిన్న పాత్రలే ఆఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోం

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించి తన జీవితం నాశనం చేసుకున్నానని అంటోంది నటి మహి గిల్. అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'దేవ్ డి' చిత్రంతో గుర్తింపు పొందిన ఈ పంజాబీ బ్యూటీ హిందీ, పంజాబీ చిత్రాల్లో నటిస్తోంది.

సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' సినిమాలో మహి గిల్ కు నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ స్టార్ హీరో సినిమా కారణంగా తనకు అవకాశాలు రావడం లేదని చెబుతోంది. 2010లో విడుదలైన 'దబాంగ్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా సోనాక్షి నటించగా.. మరో ముఖ్య పాత్రలో మహి గిల్ నటించింది.

అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పక్కన నటించిన కారణంగా తనకు అలాంటి చిన్న చిన్న పాత్రలే ఆఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో నటించి తన కెరీర్ ను ప్రశ్నార్ధకంగా మార్చుకున్నానని వాపోయింది. నా కెరీర్ లో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో నటించడమే అంటూ ఎమోషనల్ అయింది ఈ పంజాబీ బ్యూటీ. 

loader