దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీపై దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అభిమానులని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీపై దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అభిమానులని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన విధానం, వారి కష్టసుఖాలు అడిగితెలుసుకున్న విధానాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. వైఎస్ఆర్ పాత్రలో దిగ్గజ నటుడు మమ్ముట్టి నటించారు. 

ఇదిలా ఉండగా వైఎస్ తనయుడు జగన్ గురువారం రోజు వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో జగన్ కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యాత్ర చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ట్విటర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. కంగ్రాట్స్ జగనన్నా. ఈ విజయానికి నీవు అర్హుడివి. మీ తండ్రి వైఎస్ఆర్ కంటే అద్భుతమైన పాలన అందిస్తావని ఆశిస్తున్నాను. నీవు సరికొత్త అధ్యాయాన్ని రచించావు. నీది ప్రజలకు చెప్పి తీరాల్సిన కథ అని మహి వి రాఘవ్ యాత్ర 2 అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. 

దీనితో యాత్ర చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పరోక్షంగా వెల్లడించాడు. భవిష్యత్తులో జగన్ చరిత్రపై సినిమా తీసేందుకు ఈ దర్శకుడు సన్నాహకాలు చేసుకుంటున్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 

Scroll to load tweet…