ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణ ఫలించింది. మహేష్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది.

మహేష్‌ ఇటీవల పాత్రల కోసం తన బాడీని ట్రాన్స్‌ఫామ్‌ చేసుకుంటున్నారు. `వన్‌ నేనొక్కడినే` సమయంలో ఆయన లుక్‌ పూర్తిగా మారిపోయింది. సిక్స్ ప్యాక్‌ కూడా ట్రై చేశాడు. మొన్న `సర్కారు వారి పాట`లోనూ డిఫరెంట్‌ లుక్‌ ట్రై చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమా కోసం మరింతగా మారిపోయారు. ఆయన లుక్‌ షాకిచ్చేలా ఉంది. సరికొత్తగా మారిన మహేష్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. ఇన్నాళ్ల వెయిటింగ్‌కి తెరపడింది. నేటి(సెప్టెంబర్‌ 12) నుంచే రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించుకోబోతుంది. మహేష్‌ యాక్షన్‌ షురూ చేయబోతున్నారు. చిత్ర బృందం ఈ సందర్భంగా మహేష్‌ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో ఆల్ట్రా స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతున్నారు మహేష్‌. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉన్న ఆయన లుక్‌ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

Scroll to load tweet…
Scroll to load tweet…

`ఖలేజా` సినిమా తర్వాత చాలా గ్యాప్‌తో మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పైగా `అలా వైకుంఠపురములో` వంటి బ్లాక్ బస్టర్‌ తర్వాత త్రివిక్రమ్‌ చేస్తున్న సినిమా కావడం కూడా ఈ అంచనాలు పెరగడానికి కారణమని చెప్పొచ్చు. హారికా అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. దీన్ని పాన్‌ ఇండియా స్కేల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.