Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ కు తప్పని హీరోయిన్ తంటా..

  • హీరోయిన్ల కొరతతో ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ స్టార్స్
  • కాజల్, సమంత, తమన్నా, శృతి హాసన్ లతో రెండు సార్లు చేసిన హీరోలు
  • ఇప్పుడు కొత్త భామల కోసం కొనసాగుతున్న స్టార్ హీరోల వేట
  • సూపర్ స్టార్ మహేష్ బాబుకూ తప్పని హీరోయిన్ తంటాలు
MAHESHBABU STRUGGLING FOR HEROINES

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇప్పుడు సినిమా అంటేనే పెద్ద తలనొప్పి అయిపోయింది. సినిమానే ప్రాణంగా బతికే మన హీరోలకు వాళ్ల సరసన హీరోయిన్ దొరక్క ప్రాణం పోయినంత పనవుతోందట. ఇదెక్కడి గోలరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు మన హీరోలు. తెలుగులో అగ్ర శ్రేణి నాయికలుగా చెలామణి అవుతున్న వారిలో కాజల్, సమంత, తమన్నా, శృతి హాసన్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. అయితే వీళ్లంతా మన టాప్ స్టార్స్ తో రెండు లేదా అంతకు మించి సినిమాల్లో చేయడంతో ప్రేక్షకులు రొటీన్ ఫాక్టర్ తో బోర్ కొట్టి దూరమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం రాకుండా ఉండేందుకు కొత్త భామల కోసం చూస్తున్నారు మన హీరోలు.

 

అయితే ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరికీ హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద తలనొప్పి అయిపోతోంది. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు ప్రధానంగా కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత, శ్రుతి హాసన్‌ల చుట్టూనే తిరిగారు. ఐతే ఈ ముగ్గురితోనూ ఒకటికి మించి సినిమాలు చేసేసిన స్టార్లు ఇప్పుడు వాళ్ల స్టేచర్‌కు తగ్గ హీరోయిన్లు సెట్ కావడం లేదు. కొందరు హీరోల సినిమాల  షూటింగులు కూడా మొదలైపోతున్నాయి. కానీ సెట్స్ పైకెళ్లిన సినిమాలు కూడా హీరోయిన్లెవరూ తేలక సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు కూడా ఇదే తలనొప్పి తప్పేలా లేదు.


కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న భరత్ అను నేను... సినిమాకు కథానాయికగా కీర్తి సురేష్‌ను అనుకున్నట్లుగా ఇంతకుముందు వార్తలొచ్చాయి. దాదాపుగా ఆమె ఫైనలైజ్ అయిపోయింది అనుకుంటుండగా.. ఇప్పుడు ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ‘నేను లోకల్’లో బబ్లీగా కనిపించిన కీర్తిని చూసి మహేష్ పక్కన ఆమె సూటవ్వదేమో అనుకుంటున్నారట. పైగా ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించబోతుండటం.. వేరే సినిమాలు కూడా రెండు మూడు లైన్లో ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయడం కూడా కష్టమయ్యేలా ఉందట. దీంతో కీర్తిని పక్కనబెట్టేసి మరో హీరోయిన్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఆలోపు కథానాయికగా ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేద్దామని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios