సారాంశం
రష్మిక, రణ్‌బీర్ కలిసి నటించిన `యానిమల్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి గెస్ట్ లుగా రావడమనేది ఆసక్తికరంగా మారింది.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న `యానిమల్` మూవీపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడం కూడా ఇందుకు మరో కారణం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్మురేపుతుంది. సినిమా ఎలా ఉంటుందనేదానికి జస్ట్ శాంపుల్ చూపించినట్టుగా ఉంది. తండ్రి కొడుకుల మధ్య శృతి మించిన ప్రేమని అద్దం పట్టేలా సినిమా ఉంటుందని, తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. డిసెంబర్ 1న సినిమా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. హిందీ తర్వాత తెలుగు పెద్ద మార్కెట్‌గా పెరిగిన నేపథ్యంలో అంతా టాలీవుడ్‌పై దృష్టిపెడుతున్నారు. ఎక్కువగా ఇక్కడ ప్రమోషన్స్ లోపాల్గొంటున్నారు. ఇప్పటికే బాలయ్య `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో సందడి చేశారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో ఇంటరాక్షన్ ఉండబోతుంది. రణ్‌బీర్, రష్మిక, సందీప్‌రెడ్డి వంగా, నిర్మాత కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొనబోతున్నారు.
అనంతరం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. దీనికి ఇద్దరు స్టార్స్ గెస్ట్ లుగా వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, అలాగే దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా `యానిమల్` ఈవెంట్‌కి రాబోతుండటం విశేషం. అయితే ఈ ఇద్దరు రావడం వెనకాల ఉన్నా కారణమేంటనేది చూస్తే.. రణ్‌బీర్ నటించిన `బ్రహ్మాస్త్ర` చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి, దానికి సమర్పకులుగా ఉన్నారు దర్శకుడు రాజమౌళి. సినిమా ప్రమోషన్స్ లోనూ ఆయన భాగమయ్యారు. అలా రణ్‌బీర్‌తో అప్పట్నుంచే మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే టీమ్ ఆహ్వానం మేరకు ఆయన గెస్ట్ గా వస్తున్నారు.
మరోవైపు మహేష్‌బాబు గెస్ట్ గా రావడానికి కారణం `అర్జున్‌రెడ్డి` తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేయాలనుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. చాలా రోజులపాటు దీనిపై ట్రావెల్‌అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతోఈ మూవీని రణ్‌బీర్‌తో చేసినట్టు సమాచారం. అయితే ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. అలా సందీప్ పిలుపు మేరకు సూపర్ స్టార్ వస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఈవెంట్‌కి రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఈవెంట్ వేదికగా తమ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read more: ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన మధుర క్షణాలను పంచుకున్న ఇలియానా.. శారీలో ఫోటోని పంచుకుని ఎమోషనల్ పోస్ట్..